టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు బౌలింగ్ చేశాడు.
ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ శిక్షకుడు భరత్ అరుణ్.. 18 ఏళ్ల అర్జున్ బౌలింగ్‌ను ఆసక్తిగా గమనించారు. ముందుగా శిఖర్ ధవన్‌ను అర్జున్ బౌలింగ్ చేశాడు. తర్వాత కోహ్లి, అజింక్య రహానే, కేదార్ జాదవ్‌కు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేశారని బీసీసీఐ పేర్కొంది.