తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ అన్నారు. చేరికలపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ సర్దుకుపోవాలని చెప్పారు. రేవంత్ రాకను కాంగ్రెస్ నేతలు ఎవరూ వ్యతిరేకించవద్దని కోరారు. మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని చెప్పారు. ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.