తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు .
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తో కల్సి దాదాపు ఇరవై ఐదు మంది నేతలతో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .దీనిప్రకారం వరంగల్ జిల్లా నుండి వేం నరేందర్ రెడ్డి ,భూపాలపల్లి జిల్లాలో బలమైన నేతగా ఉన్న గండ్ర సత్యనారాయణ రావు ,నల్గొండ జిల్లా నుండి పోలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డితో సహా కంచర్ల భూపాల్ రెడ్డి ,పటేల్ రమేష్ రెడ్డి ,పార్టీ అధికార ప్రతినిధి నన్నూరు నర్సిరెడ్డి ,దీపక్ రెడ్డి ,కూన వెంకటేష్ గౌడ్ ,సామ రంగారెడ్డి ,మధుసూదన్ రెడ్డి ,వంటేరు ప్రతాప్ రెడ్డి ,శశికళ మాధవరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ,నాగర్ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ,బోడ జనార్ధన్ రెడ్డి ఇలా పలువురు నేతలతో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .