టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. అయితే ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని తెలగు సినీ వర్గాల్లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా జోరుగా వినిపిస్తోంది. అయినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్‌లు కామన్.. అయితే ఇప్పుడు ప్రేమ నుంచి పెళ్లి వరకు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నితిన్ తన తండ్రి సుధాకర రెడ్డికి ఈ విషయం చెప్పేసారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఎంతవరకు నిజమో అన్నది మాత్రం తెలియదు. ఇంతకీ నితిన్ ప్రేమలో పడింది ఎవరితో అంటే, అతగాడితో తొలిసారి లై సినిమాలో నటించిన హీరోయిన్ మేఘాఆకాష్ తోనే అని వినిపిస్తోంది. లై సినిమా అప్పుడే ప్రేమలో ఉన్న ఈ జంట మరొక సినిమా కూడా జంటగా చేస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నితిన్- మేఘ ఆకాష్ తో కలిసి నటిస్తున్నాడు. అయితే వీరి మధ్యన ఉన్న ప్రేమ వలెనే నితిన్, మేఘకి మరొక అవకాశం ఇచ్చినట్లు… కాదు రెండో సినిమా పట్టాలెక్కేకే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇంతిలా వ్యాపిస్తున్న రూమర్స్ మీద నితిన్ మీడియాకి, అభిమానులకి, అందరికి ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని.. సర్వత్రా చర్చించుకుంటున్నారు.