మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు కథ :
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 ఎకరాల భూమిని మానికి చెందిన మోడుబోయిన సుబ్బారావు.. తన భార్య అరుణ పేరుతో సర్పంచ్ మంచు పద్మజ వద్ద కొన్నాడు. ఈ లావాదేవీ 2000లో జరిగింది. తాము విక్రయించింది 1.20 ఎకరాల భూమేనని, మిగిలిన 30 సెంట్లు తమ స్వాధీనంలోనే ఉందని పద్మజ కుటుంబం ఎదురుతిరిగింది. దీనిపై రెండేళ్ల క్రితం అరుణ కుటుంబం సైదాపురం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఏడుకొండలు ఎస్‌ఐగా ఉన్నాడు.
ఆయన పట్టించుకోకపోవడంతో వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఎస్‌ఐ ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన సర్పంచ్ పద్మజ, ఆమె కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, జయరామయ్య, దినేశ్, శేషాద్రి, శ్రీనివాసులుపై కేసులు పెట్టాడు. పద్మజకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి.. మిగతావారిని ఈనెల 18వతేదీన కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు పంపించాడు. ఈ క్రమంలో ఏడుకొండలు.. పద్మజకి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాడు. కేసు వంకలో ఆమె ఇంటికి వెళ్లి గంటలకు గంటలు గడిపేవాడు. ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఆ సమయంలో అతని వాయిస్‌రికార్డు చేసి.. ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకి ఆమె శుక్రవారం అందించింది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళా సర్పంచ్‌పై వేధింపులు నిజమేనని తేలిన నేపథ్యంలో సైదాపురం ఎస్ఐని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.