రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. ఫిజికల్ డైరెక్టర్ గొట్టె అంజయ్య పదవి విరమణ కార్యక్రమంలో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా ఆర్గనైజర్ రేణుక, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు కూడా చాలా ముఖ్యమన్నారు. కానీ.. ఇప్పటి చదువులు పిల్లలను క్రీడలకు దూరం చేస్తున్నాయన్నారు. పిల్లలు, మహిళలు, వయోవృద్ధుల శాఖ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ రీజినల్ డైరెక్టర్‌గా రేణుకను సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.