తమిళ సూపర్‌స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన మెర్సల్ దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే మరో ప్రక్క మెర్శల్ సినిమాలో విజయ్ పేల్చిన పొలిటికల్ డైలాగులు చర్చనీయాంశంగా మారాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ మెర్శల్‌లో ఓ రేంజిలో సెటైర్లు వేసాడు. ఈ డైలాగులు తమిళ రాజకీయ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక మెర్సల్ చిత్రంలోని డైలాగులు వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం స్పందించారు.
సినీ నిర్మాతలకు ముఖ్యగమనిక.. ఇటీవల సినిమాలకు కొత్త చట్టం వచ్చింది. ఇక పై ప్రభుత్వాన్ని వాటి పథకాలను పొగుడుతూ చిత్రాలు నిర్మించాలి. లేకపోతే అంతే.. అంటూ ఆయన శనివారం తన ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టరు. తెలిపారు. వారు మెర్సెల్ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ పరాశక్తి సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిదంబరం పేర్కొన్నారు. 1950లో వచ్చిన హిందుత్వ సంప్రదాయాలను విమర్శిస్తూ పరాశక్తి సినిమా అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఇక ఇప్పుడు మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా విధానాలను వ్యతిరేకించేలా విజయ్ నోటి నుంచి డైలాగులు రావటం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.