బ్యూటీ అనేది స్త్రీల సొంతం. అందులోనూ సినిమా ఇడస్ట్రీలో ఉండే వారు. వారు బ్యూటీ గురించి మరింత శ్రద్ద తీసుకొంటారు. హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. తమ అందాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటారు. అయితే, ఇటువంటి వాళ్ల జాబితాలో మిల్కీబ్యూటీ తమన్నా ముందు వరుసలో ఉంటారు. అందులోనూ తెలుగులో ప్రస్తుతం కొనసాగుతున్న కథానాయికల్లో సీనియర్ హీరోయిన్లలో తమన్నా పేరే ముందుంటుంది. ఈ ప్రశ్ననే తమన్నా ముందు ఉంచగా.. నేనా సీనియర్‌నా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నన్నంతా సీనియర్‌గా చూస్తుంటే నవ్వొస్తోంది. తాను పదిహేనేళ్లకే కథానాయికగా చిత్రసీమలో అడుగుపెట్టానని, ఓ పదేళ్లు పరిశ్రమలో కొనసాగిందంటే చాలు.. సీనియర్ అంటూ లెక్కగట్టేస్తుంటారు అంటూ చిర్రుబుర్రులాడింది. ఓ కథా నాయికగా నా ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైందనే భావనలో ఉన్నా అని సెలవిచ్చింది తమన్నా. ఆమె ప్రస్తుతం క్వీన్ రీమేక్‌తోపాటు కల్యాన్‌రహ్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.
