పోర్న్ సుందరి సన్నీలియోన్‌కు దేశ వ్యాప్తంగా కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతెందుకు తెలుగులోనూ ఆమెకు బాగానే అభిమానులు ఉన్నారు. సన్నీలియోన్ పేరు ఓ సంచలనం. తెరపైనా, ఇంటర్నెట్‌లో ఎక్కడైనా ఈ హాట్ భామ చరిత్ర సృష్టిస్తుంటుంది. సామాజిక మాద్యమాల్లో జరిగే సర్వేలన్నీ సన్నీలియోన్‌ను మొదటి స్థానంలో నిలబెడతాయి.
అయితే, ఈ మధ్య కాలంలో సన్నీలియోన్ ఓ ప్రొడక్ట్‌కు ప్రచార కర్తగా ఉన్న క్రమంలో షోరూం ఓపెనింగ్‌కు వస్తే.. ఏకంగా రహదారులన్నీ జనాలతో నిండిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం సన్నీలియోన్ పేరు వాడుకుంటున్న వాళ్లల్లో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి చేరారు. ఈ మధ్య శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్‌కుంద్రా కలిసి అనాధాశ్రమం నెలకొల్పారు. ఈ సంస్థ అనాధల ఆలనా పాలనా చూసుకుంటుంది. అయితే, ఈ సంస్థకు అయ్యే ఖర్చుల కోసం విరాళాలను రాబట్టేందుకు శిల్పాశెట్టి ఆమె భర్తకు వచ్చిన ఆలోచనే డేట్ విత్ సన్నీలియోన్. డేట్ విత్ సన్నీ లియోన్ కార్యక్రమంలో పాల్గొనే వారు సంస్థ కోసం ఇవ్వగలిగినంత విరాళం ఇస్తారు. ఇలా.. ఎవరు ఎక్కువ విరాళం అందిస్తే వాళ్లకు సన్నీలియోన్‌తో ఒక రోజు గడిపే అవకాశం ఉటుంది. కాగా, రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి అనాధలను చేరదీసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుందని, అందుకే డేట్ విత్ సన్నీలియోన్ కార్యక్రమానికి ఒప్పుకున్నానని తెలిపింది. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా..భాగస్వామ్యం అవుతానని అంటోంది సన్నీలియోన్.
