ఇషా చావ్లా.. ఈ ఢిల్లీ బ్యూటీ 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగా ఆడింది.. ఆ తరువాత అవకాశాలు ప్రారంభమయ్యాయి ఇషా చావ్లాకు. పూల రంగడు, శ్రీమన్నారాయన, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి మేనక సినిమాల్లో నటించింది. మధ్యలో విరాట్ అనే కన్నడ సినిమాలోను నటించింది ఇషా చావ్లా. ఆ తరువాత ఇప్పటివరకు సినిమాల్లో అవకాశాలే రాకుండా పోయింది.
ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ హీరోయిన్ అవకాశాలు ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తోంది. బాలక్రిష్ణతో శ్రీమన్నారాయణలో నటించిన తరువాత నుంచి తనకు అవకాశాలు రాకుండా పోయాయని, ఆ హీరోతో ఎందుకు నటించానా అని ఇప్పుడు బాధపడుతున్నానని ఇషా తన స్నేహితులకు చెబుతోందట.
అవకాశాలు రాలేదన్నప్పుడల్లా తలుచుకుని బాలక్రిష్ణను తిట్టుకుంటోందట. ఇషా చావ్లాకు భాష రాకపోవడం, రెకమెండేషన్ చేసే వారు లేకపోవడం.. ఇవన్నీ మైనస్ పాయింట్లే. దీంతో ఇషాకు అవకాశాలు రావడమే లేదట.