తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్‌కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవల ప్రసారం అయిన జబర్దస్త్ షోలో రేష్మి కి సైట్ కొట్టే స్కిట్ జరుగుతుండగా సుడిగాలి సుధీర్‌కి తన చెప్పు చూపించి అందరికీ షాక్ ఇచ్చింది రష్మీ.
అసలు విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ టీం వేసే స్కిట్‌లో భాగంగా రష్మీ పై సెటైర్ వేశాడు.. సుధీర్ దీంతో వెంటనే రియాక్ట్ అయిన రష్బీ తన ఎడమకాలి చెప్పు చూపించింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలను కూడా రేష్మి ఖండించింది. తాజాగా చెప్పు చూపించడం ద్వారా.. ఇక ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టాలని రష్మీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నాకు తెలుగు సరిగా తెలియదు. సుధీర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కాబట్టి నాపై ఏమైనా జోక్స్ వేస్తే అడిగి తెలుసుకుంటాను. క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన తమ మధ్య ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం సరికాదు అని అంటోంది.