21 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తుళ్లూరు సీఐ యూ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు యువతులు వచ్చారు.
శిక్షణ ఇస్తున్న ఓ శిక్షకురాలికి తమ్ముడైన కుందూరి నరసింహారావు అప్పుడప్పుడూ వస్తుండేవాడు. శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి వేరేప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు నరసింహారావు శిక్షకురాలిని విచారించగా అసలు విషయం బయట పడింది. ఆమె సాయంతో నరసింహా రావు మరో ఏడుగురి సహకారంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సమాచారం తెలిసింది. పోలీసులు నిందితుల కోసం గాలించి ప్రధాన నిందితుడు నరసింహారావును తప్ప మిగిలిన వారిని అరెస్టు చేశారు. వారి లో ప్రస్తుతం ఏడుగురు చనిపోయారు. అనేక పరిణా మాల తర్వాత నరసింహారావును రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తుళ్లూరు కానిస్టేబుళ్లు తోటా ఏడుకోండలు, శ్రీనివారావును సీఐ అభినందించారు.
