కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లలా వ్యవహరించారు ఆ ముగ్గురు. అంతకు ముందు నీకు అవి కొనిస్తాం.. ఇవి కొనిస్తామంటూ ఆశ చూపి చివరకు బాలిడిపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక వారి పైశాచికత్వాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అమ్మవారిపాలెంలో చోటు చేసుకుంది. అమ్మవారిపాలెంకు ఎస్సీ కాలనీకి చెందిన 18 ఏళ్ల లోపు ముగ్గురు యువకులు అదే కాలనీకి చెందిన ఓ బాలుడ్ని పది రోజుల క్రితం అమ్మవారిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామంటూ బాలుడిని బెదిరింపులకు గురిచేశారు. అనంతరం ఆ దృశ్యాలను వాట్సాప్‌లో స్నేహితులకు పంపారు. వాటిని హైదరాబాద్‌లో ఉంటున్న అదే కాలనీకి చెందిన కొందరు చూశారు. వెంటనే ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి.. బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నరసింహారావు తెలిపారు.