Home / SLIDER / 23న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్..!

23న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్నది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలన్నింటినీ ఈ క్యాబినెట్ సమావేశం ముందుకు తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 30 అంశాలకు పైగా ఎజెండాలో ఉండే అవకాశం ఉన్నది. నీటిపారుదలశాఖలో పోస్టుల సృష్టిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎనిమిది ఆర్డినెన్సులపై అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ ఎనిమిది ఆర్టినెన్సులకు క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నది. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్నది. ప్రక్షాళన ఆ తర్వాత అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించటానికి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేస్తూ, ప్రత్యేకంగా ఆర్డినెన్సు తీసుకొచ్చింది.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనున్నారు. తెలంగాణ వ్యాట్ చట్టానికి, పీడీ యాక్ట్‌కు, గేమింగ్ చట్టానికి, ఎక్సైజ్ చట్టానికి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చట్టానికి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. వీటికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులను సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశం ఆమోదించనున్నది. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన తీర్మానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అసెంబ్లీలో అనుసరించే వ్యూహంపై కూడా చర్చించనున్నట్టు తెలిసింది.అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 26న టీఆర్‌ఎస్‌ఎల్పీ, టీఆర్‌ఎస్ నూతన కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులను ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలని సీఎం వారికి సూచించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక కార్యదర్శిని బాధ్యులుగా నియమించాలని సీఎం నిర్ణయించారు. వారి విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు, రాష్ట్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలను ప్రధాన కార్యదర్శులకు అప్పగించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat