ప్రేమించానన్నాడు.. పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.. యువతితో రెండేళ్లపాటు ఏకాంతంగా గడిపాడు.. తీరా ఆ వీడియోలను నెట్‌లో ఉంచాడు. ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
రాజాం పట్టణంలోని తెలగావీధి సత్యనారాయణపురం వీధికి చెందిన గట్టి కృష్ణా ప్రసన్నకుమార్ ఇంటర్నెట్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇదే పట్టణానికి చెందిన యువతి ఇంటర్నెట్ సెంటర్‌కి తరచూవచ్చేది. ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతితో ఏకాంతంగా ఉన్న వీడియోలను తీశాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేవడంతో తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. గట్టిగా నిదీసేసరికి స్నేహితులు, బంధువులు, తెలిసిన వారికి వాట్సాప్లో యువతి అశ్లీల వీడియోలు పంపాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ స్వరూపారాణి తలిపారు. మరో వైపు బాధితురాలికి అండగా నిలుస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాని భరోసా ఇచ్చారు.