ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీపావళి సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ… గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘ఏక్ దియా- షాహీదోం కే నామ్’కార్యక్రమానికి సీఎం యోగి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన.. ఉబికి వస్తున్న కన్నీళ్లను పలుమార్లు చేతులతో తుడుచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యనాథ్ చిన్నపిల్లలకు స్వీట్లు, పండ్లు, పాఠ్య పుస్తకాలు పంచిపెట్టారు. వంతంగియా వర్గానికి చెందిన కొందరు దివ్యాంగులకు వీల్చైర్లు పంచిపెట్టారు. గోరఖ్‌పూర్‌లోని వంతంగియా వర్గానికి లబ్ది చేకూర్చేలా ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, క్రీడా మైదానాలు, తాగునీటి వసతి సహా పలు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.