విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు.
