తమిళ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా, రాజా – రాణి ఢైరెక్టర్ తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తోపాటు.. వివాదాలనూ తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో విజయ్ పలు రాజకీయ డైలాగ్‌లు పేల్చడంతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ), డిజిటల్ చెల్లింపుల పై విజయ్ పేల్చిన డైలాగులు.. డైరెక్ట్‌గా మోదీ టీంకు తగిలాయని.. దీంతో ఆ డైలాగ్‌లు బీజేపీని అసంతృప్తికి గురిచేశాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పలు సినియా థియేటర్లపై బీజేపీ కార్యకర్తలు దాడులకు కూడా పాల్పడ్డారు.
ఈ సంఘటనలకు సంబంధించి తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. మెర్సల్ సినిమాను సెన్సార్ బోర్డు అల్రెడీ సర్టిఫై చేసింది. అందువల్ల సినిమాలోని సన్నివేశానలు కట్ చేయాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు. ఒక్క సారి సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తరువాత సీన్లు ఎలా కట్ చేస్తారంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు.