మెగా ఫ్యామిలీకి చెందిన యువహీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన బివీఎస్ రవి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ విడుదల తేదీని ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానున్నది . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన మెహరీన్ కథానాయికగా నటించింది.ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
