బిగ్బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన తరువాత.. తనకు మళ్లీ నటించాలని, ఎదగాలని కోరిక కలిగిందని సినీనటి అర్చన అంటోంది.అంతేకాక ఇంతకు ముందు తాను ఓ సారి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించానని తెలిపింది. ఒక నటిగా మంచి సినిమాల్లో నటించాలని ఉందని.. దీపావళి సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న అంశం గురించి మాట్లాడుతూ నిజాయతీ గలవాడు.. మహిళలను గౌరవించేవాడు అయి ఉండాలని తెలిపింది. అంతేగాక, మంచి మనసు ఉండాలని, తోటి వారిని గౌరవించేవాడై ఉండాలని చెప్పింది. తనకు సినిమాల్లో వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకున్నానని తెలిపింది. చాలా టీవీ షోల్లోనూ పాల్గొన్నానని చెప్పింది.