మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. బాబులో అనుభవం ఉందని వెళ్లిందట. మరి మీరు సాధారణ గృహిణి నుంచి వైయస్సార్సీపీ టికెట్ తరపున డైరెక్ట్ గాఎంపీ అయ్యారు. ఎన్నికలప్పుడు లేని అనుభవం ఆమెకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా..? ఇప్పుడు సడన్ గా కనుక్కున్నారా. ఇదేనా అభివృద్ధి? ఎలక్షన్ అయిపోయాక వారం రోజుల్లోనే ఎస్పీవై రోడ్డి వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నప్పుడు కనబడని అనుభవం ఆయన వారం రోజుల్లోనే కనబడిందట. బాబుకు అనుభవం ఉన్నప్పుడు టీడీపీలో పోటీ చేయకుండా మా టికెట్ పై ఎందుకు పోటీ చేశారు. వైయస్సార్సీపీ సీటు నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ఏమైనా మాట్లాడితే అభివృద్ధి అని మాట్లాడడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయిందని బుగ్గన మండిపడ్డారు. పదవులకు రాజీనామా చేయాలని ఫిరాయింపుదారులను డిమాండ్ చేశారు. టీడీపీ తెలుగు ఎంపీ ఎమ్మెల్యేల సంక్షేమ పథకం అనే కొత్త పథకాన్ని చేపట్టిందని బుగ్గన ఎద్దేవా చేశారు. ఆర్థిక నష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలను ఈ పథకంలో మనీ బ్యాక్ గ్యారంటీ స్కీమ్ కింద తీసుకుంటున్నారేమనని ఎద్దేవా చేశారు.