మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలు క్రియేట్ చేయడంలో పట్టా పొందారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రకటించి నప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇక రాము లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వర్మ పై విరుచుకు పడుతుండగా.. వర్మ కూడా అంతే ధీటుగా సింగిల్ హ్యాండ్‌తో టీడీపీ బ్యాచ్ మొత్తాన్ని ఆడేసుకుంటూ తన చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ సంపాదిస్తున్నాడు.
దీంతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మ పై టీడీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని చెప్పిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నుండి ఎలాంటి కవ్వింపులు రాక పోయే సరికి వర్మకి బోర్ కొట్టిందేమో దీపావళి సందర్భంగా ఒక పోస్టు చేసి మరోసారి బాంబు పేల్చాడు. దీపావళిని పురస్కరించుకుని వర్మ ఫేస్ బుక్ లో తాజాగా ఒక పోస్టు చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్స్ లక్ష్మీ బాంబ్.. ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మీ బాంబులు పేలబోతున్నాయి. హ్యాపీ నెక్స్ట ఇయర్స్ దివాలి అంటూ పోస్టు చేశాడు. దీంతో ఇప్పటికే తన మార్కు శాడిజంతో ఆడేసుకుంటున్న టీడీపీ బ్యాచ్ నెత్తి మీద వర్మ మరోబాంబు పేల్చాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు.