తెలంగాణ టీడీపీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రకంపనలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి .అందులో భాగంగా దీనిపై ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరిగింది.ఈ భేటీ ఇరు వర్గాల నేతల మధ్య వార్ జరిగినట్లు సమాచారం .
ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,రావులా ,అరవింద్ కుమార్ పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు .
భేటీ అనంతరం కూడా రేవంత్ మీద ఎటువంటి స్పష్టత రాకపోవడంతో కింది స్థాయి వర్గం సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది .అందులో భాగంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి కి చెందిన ప్రధాన అనుచరవర్గం ఈ రోజు సాయంత్రం మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు .