‘రారండోయ్ వేడుక చూద్దా’ సినిమాకు ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నుటడు చలపతిరావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ యాంకర్ రవి ‘సూపర్ సర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్ రవి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓమాట్లాడుతూ.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ తరువాత టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు.
ఈ నేపథ్యంలో తనకు ఆడియో సిస్టమ్ ప్రాబ్లెమ్ కారణంగా వినిపించలేదని, అందుకే అలా అన్నానని వివవరణ ఇచ్చినా ఎవరూ వినలేదని అన్నాడు. ఆ సమయంలో ఇంట్లోని అమ్మ, నాన్న, చెల్లి ఎటువెళ్లినా దీనిపై ప్రశ్నించేవారని, తన తండ్రి కూడా తన మాట నమ్మలేదని రవి చెప్పాడు. దీంతో ఆ టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. అయితే అలాంటి సమయంలో తనకు శ్రీముఖి, సమ, ప్రదీప్ అండగా నిలిచారని అన్నాడు. వారు ముగ్గురూ ఇలాంటి సిట్యుయేషన్ ను తాము కూడా ఫేస్ చేసినట్టు చెప్పారని అన్నాడు. ఇప్పుడెంత చెప్పినా ఎవరూ నమ్మరని అన్నాడు. ఆ రోజు శ్రీముఖి ఇచ్చిన స్ట్రెంగ్త్, సుమగారు ఇచ్చిన భరోసాతనను ఇక్కడ ఇంకా ఉండేలా చేశాయని రవి తెలిపాడు.