అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత ఇక సినిమాల్లో నటిస్తుందా.. లేదా..అనే సంధేహాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. అమల కూడా ఒకప్పడు హీరోయినే. అయితే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత నటనకు దూరం అయిపోయింది. ఇప్పుడు సమంత కూడా అలా నటనకు దూరం అయిపోతారా.. అంటే కాదని చెబుతుంది సామ్.
ఇప్పుడు కూడా నటన కొనసాగిస్తారా.. అంటూ అక్కినేని వారి కోడలైన నటి సమంతను అందరూ పదే పదే అడుగుతున్నారట. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి చెప్పీ సామ్ విసుగొచ్చేస్తోందట. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. తనను ఇప్పుడు కూడా ఇలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడంలేదు తనకు కుటుంబం ఎంత ముఖ్యమో నటన కూడా అంతే ప్రధానమని.. అయినా నేనెందు నటనని వదులు కోవాలని ఎదురు ప్రశ్నిస్తోంది.. ఒకదాని కోసం మరోదాన్ని వదులుకోలేనని క్లారిటీ ఇచ్చేసింది.