Home / SLIDER / రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!

రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!

ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం న‌డిచింద‌ని అంటున్నారు. తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ అయిపోయింద‌ని గ్ర‌హించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు స‌ర్వం సిద్ధ‌మ‌యిన‌ట్లు గ‌తంలో జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీలో చేర‌డం ఎందుకు ఆగిపోయింది?  తాజాగా ఆయ‌న కాంగ్రెస్‌కు ఎందుకు ఓకే చెప్పేశారు అనే చ‌ర్చ‌కు రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది.
విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆత్మ‌గా పేరున్న అమిత్ షా వ‌ల్లే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఆగిపోయిందట‌. ఎందుకంటే….రేవంత్ రెడ్డి రాజ‌కీయ జీవితంలో అత్యంత మ‌ర‌క‌గా మిగిలిన ఓటుకునోటు కేసు అని తెలుస్తోంది. తెలంగాణలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెండ్‌గా ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని దోషిగా తేల్చ‌డం…ఇప్ప‌టికీ ఆ కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌టం..ఇవ‌న్నీ తెలిసిన సంగ‌తే. అయితే ఈ విష‌యాలు అమిత్ షాకు సైతం చేరిపోయాయ‌ట‌.
పార్టీ మారాల‌ని డిసైడ‌యిపోయి….బీజేపీ వైపు తొంగిచూస్తున్న స‌మ‌యంలో…ఆయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ త‌దిత‌రాల గురించి పార్టీ ర‌థ‌సార‌థి అమిత్ షా ఎంక్వైరీ చేశారని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్ర, ఇంకా కేసు కొన‌సాగుతుండ‌టం బ‌య‌ట‌ప‌డిందని అంటున్నారు.  బీజేపీ అవినీతికి వ్య‌తిరేకం అని బలంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో…రేవంత్ రెడ్డిని చేర్చుకోవ‌డం ద్వారా పార్టీ ప‌రువును బ‌జారు పాలు చేసుకోవ‌డం ఇష్టం లేక అమిత్ షా ఆగిపోయార‌ట‌. ఓటుకు నోటు కేసు నుంచి విముక్తి అయిన త‌ర్వాతే పార్టీ చేరిక గురించి చ‌ర్చించాల‌ని అమిత్ షా స్ప‌ష్టం చేసిన‌ట్లు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి కాషాయ పార్టీలో చేరలేదని బ‌దులుగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat