తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది .అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తెలుగు తమ్ముళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఈ భేటీ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్యే ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు అయిన డీకే అరుణతో నగరంలో గోల్కొండ హోటల్ లో సమావేశం అయ్యారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నాను ..తన చేరికను వ్యతిరేకిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు నచ్చచెప్పాలని ఈ సందర్భంగా అరుణ తో రేవంత్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి .
అయితే ఇప్పటికే టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు రేవంత్ ఉంటె ఎంత ..పోతే ఎంత ..అయనను భరించే శక్తి తమకు లేదని మీడియా ముందు తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .దీంతో రేవంత్ పార్టీ మారడం ఖాయం అని అంటున్నాయి రాజకీయ వర్గాలు ..