తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం అయింది .ఈ సమావేశానికి రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,ఇతర పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు .
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న తరుణంలో టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆయన కూడా పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు అయ్యారు .అయితే రేవంత్ రెడ్డి పోలిట్ బ్యూరో సమావేశానికి నగరంలో తన ఇంటి దగ్గర నుండి పది గంటలకే బయలు దేరారు .
అయితే దాదాపు గంటన్నర తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు .ఈ గంటన్నర సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడకి వెళ్లారు .ఎవర్ని కలిశారు అని తెలుగు తమ్ముళ్ళు ఆరా తీస్తున్నారు .ఈ గంటన్నర సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన చేరికను వ్యతిరేకిస్తున్నవారిని గోల్కొండ హోటల్ లో కలిశారు..ఈ సందర్భంగా వార్ని బుజ్జగించారు అని తెలుగు తమ్ముళ్ళు గుసగుస లాడుకుంటున్నారు .దాదాపు గంటన్నర పాటు అదృశ్యమై రేవంత్ తెలంగాణ టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చారు .