తెలంగాణ తెలుగు దేశ పార్టీ పోలిట్ బ్యూరో ,సెంట్రల్ కమిటీ సమావేశం ఈ రోజు ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగింది .ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,రావులా ,అరవింద్ కుమార్ పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు .ఈ సమావేశానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు .
ఈ భేటీలో ఎల్ రమణ మాట్లాడుతూ “పార్టీ జాతీయ అధిష్టానానికి తెలియకుండా మీరు ఎలా కాంగ్రెస్ నేతలను కలుస్తారు .ఎవరకి చెప్పకుండా పొత్తులపై మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు .మీరు ఎవరికీ చెప్పా పెట్టకుండా ఢిల్లీ కు ఎందుకు వెళ్లారు అని నిలదీశారు .
మరోవైపు మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర మంత్రులు ,టీడీపీ సీనియర్ నేత అయిన యనమల ,పరిటాల సునీత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు .ఎందుకు అలా మాట్లాడారు .ఇలా మాట్లాడితే మన పార్టీ పై ఉన్న కాస్త నమ్మకం కూడా ప్రజల్లో పోతుంది అని కొంచెం ఆగ్రహంగా అన్నారు అంట .దీంతో రేవంత్ రెడ్డి మీరు ఎవరు నన్ను అడగటానికి ..నేను అన్ని విషయాల గురించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తా అని ఆయన రిప్లై ఇచ్చినట్లు వార్తలు వస్తోన్నాయి .