టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రేణుదేశాయ్ సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని.. విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. పూణేలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ తాజాగా స్టార్ మాటీవీలో ఓ డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన రేణు దేశాయ్ తన రెండో పెళ్లి పై కామెంట్ చేసి వివాదానికి తెరలేపింది.
దీంతో కొద్ది రోజుల క్రితం పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో మరింత ఆగ్రహంగా ఉంది రేణు. తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని కాకపోతే నా మనసు కి నచ్చిన మనిషి తారసపడినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వరకు ప్రేమ తనకి నమ్మకం లేదని చెప్పిన రేణూ.. తను హోస్ట్‌గా చేస్తున్న డ్యాన్స్ షోలో ఒక దివ్యాంగుల జంటని చూశాక.. ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రేమ పై నమ్మకం కల్గుతోందని.. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఆ కపుల్‌ని పిలుస్తానని చెప్పింది. ఇక మొత్తానికి రేణు రెండో పెళ్లి చేసుకోవడం ఖాయమైందని.. అయితే అది ఎవరితో.. ఎప్పుడు.. ఎక్కడ.. అనేది తేలాల్సి ఉందని సర్వత్రా చర్చదించుకుంటున్నారు.