బాహుబలిసినిమా తరువాత ఎక్కడ చూసినాప్రబాస్ పేరు మారుమోగిపోతోంది. అంతకు ముందు టాలీవుడ్‌కే పరిచయమైన ప్రబాస్ రాజమౌళి దర్శకత్వంలో.. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ఆ చిత్రంలో హీరో ప్రబాస్ రాజసానికి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అందులోనూ ప్రబాస్ ఆరుడుగులు ఉండటంతో పాటు బ్యాచలర్ కావడంతో అమ్మాయిల నోట హీరో ప్రబాస్ పేరు మారుమోగి పోతోంది. తాజాగా.. ఈ జాబితాలో ఓ స్టార్ హీరో కూతురు కూడాచేరి పోయింది. ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని..అతనితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని ప్రాధేయపడుతోంది.
ఇంతకీ ఆభామ ఎవరనుకుంటున్నారా..? మరెవరో కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ తండ్రి వారసత్వంతో ఇండస్ర్టీలోకి హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లోనూ తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ ఓ డబ్బింగ్ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. కానీ..అదేమి ఆమె అనుకున్నంత క్రేజ్ తెచ్చిపెట్టలేదు. అయితే, ఇప్పుడామె ప్రభాస్‌గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీగానిలిచింది. రీసెంట్‌గా ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో అవకాశం వస్తే ఎవరితో నటిస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ బాముబలి చిత్రంలో ప్రభాస్ అదరగొట్టేశాడని, ఆ సినిమా తరువాత ప్రభాస్ ప్రభాస్‌కు వీరాభిమానిని అయ్యానని, అతనితో కలిసి నటించాలని వెల్లడించింది. మరి ఆమె కోరిక తీరాలని ఆశిద్దాం.