టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంసీఏ( మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తున్న నాని.. నేను శైలజ ఫేం తిరుమల కిషోర్ దర్వకత్వంలో నాని నటిస్తున్నాడని సమాచారం. నేను శైలజతో వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రామ్ కు హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల మళ్లీ అతనితోనే ఉన్నది ఒకటే జిందగి సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం ఈ నెల చివరన రిలీజ్ కాబోతుంది. ఈలోగా నానికి ఓ స్టోరి చెప్పి ఖరారు చేసుకున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ గా చిత్రలహరి అని పెట్టబోతున్నారట.
దూరదర్శన్‌లో ఒకప్పుడు పాటల ప్రోగ్రాం టైటిల్ కావటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. చిత్రలహరి అంటే తెలుగు పాటలను వరుసగా వేసే ఒక కార్యక్రమం. అప్పట్లో వేరే ఛానళ్ళు యుట్యూబులు లేవు కాబట్టి.. ఒక సినిమా పాటను ధియేటర్లో కాకుండా మరో చోట చూడాలంటే.. ఓన్లీ శుక్రవారం వచ్చే చిత్రలహరి కార్యక్రమంలో మాత్రమే చూడాలి. ఇక చిత్రలహరి తెలుగు అచ్చమైన తెలుగు పేరు.. అందునా అప్పట్లో సూపర్ హిట్ ప్రోగ్రామ్.. దీంతో ఈ కాంబినేషన్ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కల్గిస్తోందని.. కరెక్ట్ పాయింట్‌తో తీస్తే.. సంచలనం రేపడం ఖాయమని సర్వత్రా భావిస్తున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు వేణు శ్రీరామ్ తీసిన ఎంసిఎ ఓ ప్రక్కన రెడీ అవుతుంటే.. మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్దం చేస్తున్నాడు. అది కాకుండా శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగ్ తో మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఇప్పుడు కిషోర్ తిరుమలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.