హైదరాబాద్ నగరంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఓ హోటల్‌పై ఈ రోజు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు జరిపి 40మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, విదేశీ మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. సంపున్న మహిళలు కూడ ఉన్నారు. వీరి దగ్గరి నుండి కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమచారం . మూడు రోజుల నుంచి హోటల్‌లో మకాం వేసి పేకాడుతున్నట్లు తెలుస్తోంది. కాగా కీలక సూత్రధారులైన సంజయ్ కుమార్, ప్రవీణ్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్నవారిని పోలీసులు ఇవాళ కోర్టులో హాజరు పెట్టనున్నారు.
