తనలో చూపించేందుకు ఎంతో గ్లామర్ ఉందంటోంది అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్. అంతేకాదు ఎలాంటి గ్లామర్ పాత్రలో అయినా ఒదిగి పోయేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే స్కిన్ షో కోసం బికినీ వేసేందుకు కూడా సై అంటోందట. ఇప్పటికీ హీరోయిన్‌గా తన మార్కు చూపించలేకపోతున్న ఆ అందాల చిన్నది అందాల ఆరబోత విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తోంది.
అమ్మడికి అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందే కానీ అలాంటి రోల్స్‌లో ప్రగ్యా సక్సెస్ సాధించిన దాఖలాలు మాత్రం దాదాపుగా లేవనే చెప్పాలి. కొందరైతే ముద్దుగుమ్మ ‘కంచె’ తరహా పాత్రకు మాత్రమే సరిపోతుందనే నిర్ణయానికి కూడా వచ్చేశారు.
అయితే ప్రగ్యా జైస్వాల్ మరీ ఎగబడి అందాలు ఆరబోయిన సినిమా నక్షత్రం ఏమైందో అందరికీ తెలిసందేనని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రగ్యా అందాల విందు కారణంగా సినిమా ఫలితం మారుతుందని ఊహించలేమని అయినా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చు కాబట్టి ప్రగ్యా అందాల ఆరబోత ఆమె ఇష్టమని సినీజనం చర్చించుకుంటున్నారు.