కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..అని చెప్పాడు ఓ మహాకవి. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు. అంతే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో అమ్మాయిలు.. అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రంగుల ప్రపంచంలో.. అందులోనూ బుల్లితెర పై అంతా మహిళల హవా నడుస్తోంది. ఇప్పటికే స్మాల్‌స్క్రీన్ పై సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖిలు రచ్చ రచ్చ చేస్తుంటే మరో యాంకర్ విష్ణుప్రియ దూసుకువచ్చింది.
ఓ ప్రముఖ చానల్‌లో పోవే పోరా ప్రోగ్రాంలో తనదైన హావభావాలు పలికిస్తూ అందరి చూపును తనవైపుతిప్పుకునేలా చేసిన విష్ణుప్రియ. చీర కట్టులతో.. పొట్టి పొట్టి డ్రస్సులతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ మతులు పోగొడుతున్న టైమ్‌లో.. ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ లేకుండా.. కేవలం తన యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో వెబ్‌సిరీస్ లలో నటించినా రాని క్రేజ్ ఈ ఒక్క షోతోనే వచ్చిందని.. ఈమె రాకతో సీనియర్ యాంకర్ల పునాదులు కదిలిపోనున్నాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు.