రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో స్త్రీలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకలో హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, సూపర్ సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వారిద్దరిపై మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఆడియో సిస్టమ్ ప్రాబ్లమ్ కారణంగా ఆయనేమన్నారో అసలు తనకు వినిపించలేదని, అందుకే క్యాజువల్‌గా అలా అనేశానని, ఆ తర్వాత వివవరణ ఇచ్చినా వాటిని ఎవరూ విశ్వసించలేదని రవి అన్నాడు.
ఇక ఆ సమయంలో ఇంట్లో కూడా అమ్మ, నాన్న, చెల్లితో పాటు ఎక్కడికి వెళ్లినా అందరూ దీనిపైనే ప్రశ్నించేవారని, తన తండ్రి కూడా తన మాట నమ్మలేదని రవి చెప్పాడు. దీంతో ఆ టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. అయితే అలాంటి సమయంలో తనకు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని అన్నాడు. వారు ముగ్గురూ ఇలాంటి సిట్యుయేషన్‌ను తాము కూడా ఫేస్ చేసినట్టు చెప్పారని అన్నాడు. ఇప్పుడెంత చెప్పినా ఎవరూ నమ్మరని అన్నాడు. ఆ రోజు శ్రీముఖి ఇచ్చిన భరోసా, సుమగారు ఇచ్చిన స్ట్రెంగ్త్ తనను ఇక్కడ ఇంకా ఉండేలా చేశాయని రవి తెలిపాడు.