బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. అంతేకాదు.. ఈ సారి ఏకంగా నిర్మాత కరణ్ జొహార్ ఆశలపై నీళ్లు జల్లింది. అయితే, కరణ్ జొహార్ నిర్మాణంలో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ నటీనటులుగా వచ్చిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమా ఈ దివాలీకి ఐదేళ్లు పూర్తి చేసున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్‌కి కరణ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర యూనిట్‌తోపాటు కరణ్ పిల్లలు యష్, రూహీ కూడా పాల్గొన్నారు. ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామం ఖాతాలో షేర్ చేసింది. నిజానికి తన పిల్లలను సైఫ్, కరీనాల పుత్రుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టినరోజు నాడు ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయాలని కరణ్ అనుకున్నాడు. కానీ ఆలియా ఫొటోలు షేర్ చేయడంతో కరణ్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
