తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్సీల వరకు ఒక్కర్ని విడిచిపెట్టకుండా విమర్శలు ,ఆరోపణలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే .
ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు ,ఏపీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గురించి రేవంత్ మాట్లాడుతూ ఆయన రెండు వేల కోట్ల రూపాయల వ్యాపారాలను తెలంగాణ రాష్ట్రంలో చేస్తోన్నారు అని ఆరోపణలు చేశారు .అంతే కాకుండా మరో మంత్రి పరిటాల సునీత ,ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పై కూడా ఆరోపణలు చేశారు .
అయితే తమ పార్టీకి చెందిన కింది స్థాయి నేతపై ఆరోపణలు వస్తేనే తట్టుకోలేని బాబు అండ్ బ్యాచ్ ఏకంగా తమ పార్టీకి చెందిన నేత ,ముఖ్యంగా రాష్ట్రానికి అధ్యక్షుడు తర్వాత అధినేతగా ఉన్న రేవంతే స్వయంగా ఆరోపణలు చేసిన కానీ గమ్మున ఉండటానికి ప్రధాన కారణం ఆయన చేస్తోన్న ఈ ఆరోపణల వెనక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి అని తెల్సిన తర్వాతే మాట్లాడాలని బాబు సలహా ఇచ్చారు అంట .ఆ విషయం తెల్సిన తర్వాతే రేవంత్ పై దాడికి దిగాలని ఇటు పార్టీ నేతలకు అటు తన ఆస్థాన మీడియాకు బాబు ఆదేశాలిచ్చారు అంట .