అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తోన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది .ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి (94)కన్నుమూశారు .
గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి .గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు .
కొద్ది సేపటి క్రితమే రాజ్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ పార్ధివ దేహం మీద పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు .రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తోపాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు .