తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ .తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని వార్తలు .
అయితే ప్రస్తుతం వస్తోన్న రేవంత్ రెడ్డి పార్టీ మార్పు గురించి వార్తల గురించి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు .ఆయన రేవంత్ చేరిక గురించి మాట్లాడుతూ “టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని తెలియదు .
అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి తమ పార్టీలో చేరతారు అంటే ఆ విషయం గురించి మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అని ఆయన తేల్చేశారు .