తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం .
అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్నిటిని సరి చేసి విడుదల చేయనున్నది సమాచారం .ఇప్పటివరకు మొత్తం ఎనిమిది వందల ఏడువందల తొంబై రెండు పోస్టులతో నోటిపికేషన్ జారి చేయడానికి సిద్ధమైనట్లు టాక్ .
ఇందులో భాగంగా తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ 1754,భాష పండితులు 985,పీఈటీ 42,ఎస్జీటీలు 636 పోస్టులు ఉన్నాయి .ఉర్దూ మీడియం స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ 196, భాష పండితులు26,పీఈటీ42,ఎస్జీటీలు 636 పోస్టులు ఉన్నాయి .