తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం కోర్టు కేసు గురించి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు అని ఆయన అన్నారు .తను ఎప్పుడు పార్టీ మారతారు అని ఎక్కడ ప్రస్తావించలేదు .ఇంతమాత్రాన బ్రేకింగ్ ల ,హాల్ చల్ చేయడం ఎందుకు అని అయన అన్నారు .అయితే ఎక్కడ కూడా తనపై పార్టీ మారుతున్నారు అని వార్తలను కూడా రేవంత్ రెడ్డి ఖండిచలేదు .అంతే కాకుండా ఏపీ ప్రాంత టీడీపీ నేతలను రేవంత్ టార్గెట్ చేసి మాట్లాడటం కూడా రేవంత్ పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు అని సంకేతాలు ఇస్తున్నట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .అయితే రానున్న రెండు మూడు రోజుల్లో తేలనున్నది .