హన్సిక అంటే బొద్దుగా అందంగా చూడగానే మతి పోగొట్టే రూపం అమ్మడు సొంతం .మొదటిలో వరసగా అవకాశాలు వచ్చిన కానీ ఆ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం గగనమైంది .అయితే కోలీవుడ్ లో మాత్రం ఆమె ఇంటి గడప ముందే నిర్మాతలు డేట్స్ కోసం వాలిపోతున్నారు .హన్సిక ఈ రోజు దీపావళి పండగ ఎలా చేసుకుంటారో వివరించింది .
ఒక ప్రముఖ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “షూటింగ్ లేనప్పుడు సెలవులు దొరికిన లేదా పండగ రోజు తెగ ఎంజాయ్ చేస్తాను .మరి ముఖ్యంగా పండుగ రోజు అయితే ఆ క్రేజ్ చెప్పలేను .ఈ దీపావళి కి మాత్రం వంద మంది మొత్తం బంధువులు కల్సి వచ్చారు .రెండు రోజులు లక్ష్మీ పూజ చేస్తాం .అయితే ఈ పూజ మొదటి రోజు నాడే అమ్మ గారు గాగ్రా చోళీ కొన్నారు .
రెండో రోజు మాత్రం హాఫ్ శారీ కుట్టించారు .అయితే ఇంట్లో విషయం పక్కన పెడితే నేను దత్తత తీసుకున్న పిల్లలను ఆనందపరచడం నా బాధ్యత .అందుకే ఈ రోజు వాళ్ళకు దీపావళి బహుమతులిచ్చి కాసేపు వాళ్లతో గడిపి ఆనందాన్ని పంచుతా అని ఆమె అన్నారు