తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్లా అయిన సరే అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు .ఈ క్రమంలో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డు పడుతూ ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేస్తోన్నారు అని అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .
అయితే ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులకు గుడ్ న్యూస్ ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమద్ అజారుద్దీన్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణలో ఆయనకు ఎక్కడినుంచి టికెట్ ఇచ్చేందుకైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.