ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గంధం నందగోపాల్ డెంగ్యూ భారిన పడి రాష్ట్రంలో విశాఖ పట్టణంలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం మరణించారు .నర్సింగబిల్లి ప్రాంతానికి చెందిన నందగోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటి చేశారు .
ఆ తర్వాత ఆయన రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర చిట్ట చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్య ఆంధ్రప్రదేశ్ పార్టీ తరపున 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయారు .నందగోపాల్ కు భార్య సత్యనారాయణమ్మ ,ఇద్దరు కుమార్తెలున్నారు .పెద్ద కూతురు సునంద అమెరికా లో ఉంటున్నారు .చిన్న కుమార్తె అయిన సునీత వైజాగ్ లో గంధం స్టైల్ తో ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు .