ఒకప్పుడు కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటించి నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. అంతేకాదు. నమిత అందాలకు ఫిదా అయిన అభిమానులు.. నమితకు గుడి కూడా కట్టేశారు తమిళ తంబీలు. తమ అందాల దేవత నమితేనంటూ.. ఆ గుడిలో పూజలు కూడా చేస్తున్నారు. నమితను భారీ అందాల భామగా పిలుచుకునే వారు అభిమానులు.
కొన్ని సంవత్సరాలపాటు తెలుగు, తమిళ ఇండస్ర్టీల్లో ఓ వెలుగు వెలిగిన నమితకు కొత్త కథానాయికల రాకతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. నా వయసేంటి? .. ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు? అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది. ఇక శరత్ బాబు కూడా ఈ ప్రచారం తన ఇమేజ్ ను దెబ్బతీస్తోందంటూ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 60 యేళ్లు దాటిన తనకి మళ్లీ పెళ్లేమిటి? ఒకవేళ చేసుకోవాలనుకుంటే ముందుగా మీడియాకే చెబుతానని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రచారానికి ఇంతటితో తెరపడుతుందేమో చూడాలి.