ఎప్పుడు..ఎక్కడ చూసిన ఎఫైర్ వార్తలతో హీట్ పెంచే హీరోయిన్ గా దీపిక పదుకునే ఇప్పటికే రణబీర్‌కపూర్‌తో డేటింగ్ చేసి వార్తల్లోకొచ్చింది. ఆ క్రమంలోనే కింగ్ ఫిషర్ వారసుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్ వ్యవహారం అంతే గమ్మత్తుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు ఎఫైర్లు గతంలో కలిసిపోయాక, బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ లైన్లోకి వచ్చాడు. భన్సాలీ `రామ్‌లీల` సినిమాతో రణవీర్‌తో కొత్త ఎఫైర్ మొదలు పెట్టింది దీపిక. ప్రస్తుతం ఈ జోడీ మధ్య జోరుగా ప్రేమాయణం సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
సరిగ్గా ఇలాంటి టైమ్‌లో ఊహకందని ట్విస్టులు దీపిక లైఫ్‌లోకి ప్రవేశించాయి. రీసెంటుగానే హాలీవుడ్ టాప్ స్టార్ .. ట్రిపుల్ ఎక్స్ కోస్టార్.. విన్ డీసెల్‌తో ప్రేమయాణం సాగిస్తున్నానని దీపిక స్వయంగా ప్రకటించి షాకిచ్చింది. దీంతో రణవీర్ ఇక సైడైపోయినట్టేనని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కూడా ఆ జోడీ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ .. పార్టీలు, పబ్బులకు షికార్లు చేయడంపై వాడి వేడి చర్చ సాగింది. ఇక ఇంతలోనే నిన్న జరిగిన హేమమాలిని పుట్టినరోజు వేడుకల్లో దీపిక పదుకొన్ మాట్లాడిన ఓ మాట అందరికీ షాకిచ్చింది. అందరు ఆడపిల్లల తండ్రుల్లానే తనకు తండ్రి ప్రకాశ్ పదుకొనె సంబంధాలు చూస్తున్నారంటూ చెప్పింది. సూటిగా అలా చెప్పకపోయినా.. నాన్న గారు కూడా సంబంధాలు చూస్తున్నారేమో..! అంటూ నవ్వేసింది. ఆ క్షణం అక్కడ రణవీర్ ఉండి ఉంటే మొహం మాడిపోయే మ్యాటరే అది. మరి ఇంతకీ ఎదిగొచ్చిన పిల్లకి నాన్నోరు సంబంధం వెతుకుతున్నారా? లేదా? ఒకవేళ రణవీర్‌తో డేటింగ్‌కి అంగీకరించారా? ఏమో .. దీనికి కూడా దీపికనే సమాధానం చెప్పాలి.