జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పక్కన జోడి కట్టేందుకు చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి చేరిపోయింది. తనకు ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని పబ్లిక్‌గా చెప్పేసింది. ప్రస్తుతం వరలక్ష్మి శక్తి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక ఈ సందర్భంగా వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మంచి స్క్రిప్ట్ దొరికితే గ్లామరస్ పాత్రల్లో నటించడానికైనా సిద్ధమే. చాలా మంది ప్రభాస్‌తో కలిసి నటిస్తారా అని అడుగుతున్నారు. ఆయనతో కలిసి నటించాలని ప్రతి నాయికా కోరుకుంటుంది. ఇందుకు నేనేమీ మినహాయింపు కాదు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ పనితీరు చూశాను.. చాలా నచ్చింది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లాంటి గొప్ప నటులు ఉన్నారు. కాబట్టి నేనూ తెలుగులో మంచి పేరు తెచ్చుకొని మంచి అవకాశాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.