టాలీవుడ్ మామ కోడళ్ళు అక్కినేని నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గది- 2 విడుదల అయ్యి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గదికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టిన , సోమవారం నుండి అన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యినట్లు సమాచారం. దీంతో సినిమా కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్ సీరత్ కపూర్ అందాలను ప్రేక్షకులకు ఏరా గా వేయడం మొదలు పెట్టారు.
ఈ మూవీలో నటించిన సీరత్ కపూర్ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసిన సంగతి తెల్సిందే. అందుకే ఆమె హాట్ హాట్ పిక్స్ ను రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఈ రకంగా యినా సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ నమ్మకం. మరోవైపు నాగార్జున సైతం ఎన్నడూ లేని విధంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయ్నతనం చేస్తున్నాడు. ప్రెస్ మీట్ , సక్సెస్ మీట్ , స్వయంగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్లడం ఇలాంటివి చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. మరి సీరత్ అందాలను చూసి థియేటర్స్ కు పరుగులు పెడతారో లేదో చూడాలి.