అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న సమంతకి అస్సలు వంట రాదట. మొన్నటి వరకు సినిమా సెట్స్ లలో పెట్టె భోజనం తప్ప చేతి వంట రుచి చూడని సమంత ఇప్పుడు స్వయంగా చేసుకున్న చేతి వంట తినడమే కాదు పలువురికి రుచి చూపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా సమంత వంటింట్లోనే గడిపేస్తుందట. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు సమంతని వంట గురించి అడిగితే.. నా ప్రియుడికి వంట బాగా వచ్చు.. ఇక నేను నేర్చుకోవడం ఎందుకు.. అంటూ నవ్వేసేది.
ఇక నాగచైతన్య వంట చేయడాన్ని చూస్తూ, ఆ వంటకాల్ని టేస్ట్ చేస్తూ మురిసిపోయేది. పెళ్లయ్యాక మాత్రం ఆమె వంట నేర్చుకోవాలని నిర్ణయించుకొంది. వంటింట్లోకి వెళ్లి గరిట తిప్పబోతోందట. నాగచైతన్య, సమంత లు పెళ్లి చేసుకున్న తర్వాత విందు భోజనాల కోసం బంధువులు ఆహ్వానిస్తున్నారట. అలా వెళ్లినప్పుడు ఆ ఇళ్లల్లో మహిళలు ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థమైందట సమంతకి. అందుకే ఆమె కూడా వంట నేర్చుకోవాలని నిర్ణయించుకొన్నారట. ప్రస్తుతం సమంత ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు సినిమాలు షెడ్యూల్ చూసుకుంటుంది.